
సింగర్ రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సంగతి
మనకు తెలిసిందే!కాగా ఆయన భార్య రేవంత్ బిగ్ బాస్ లోకి
వచ్చేముందు ఆవిడ గర్భం తో ఉన్నారు. ఆ టైం లో అన్విత కి
తన అవసరం ఎంత ఉంటుందో తెలిసిన కూడా రేవంత్ తన వైఫ్
మరియు తనకు పుట్టబోయే బిడ్డ ఫ్యూచర్ కోసం బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం
జరిగింది.

కాగా రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడే
అన్విత కి కుటుంబ సభ్యులు శ్రీమంతం
చేసారు. ఆ వీడియో ని బిగ్ బాస్ రేవంత్
కోసం హౌస్ లో ప్లే చేసారు. ఆ వీడియో చూస్తున్నపుడు రేవంత్
చాల ఎమోషనల్ అయిపోయాడు. చిన్నప్పుడే తాను తండ్రిని కోల్పోయానని
తాద్రి లేని లోటు ఎలా ఉంటుందో అనేది తనకు బాగా తెలుసనీ చాల
బాధ పడ్డ సంగతి తెలిసిందే! అంతే కాకుండా తన బిడ్డ తనని ఎపుడెపుడు నాన్న అని పీలుస్తుందా
అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అని కంటతడి పెట్టుకున్నాడు.

ఇక ఇపుడు అన్విత పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని
ముద్దులొలికే చిన్నారి తాను బిగ్ బాస్ హౌస్ నుండి తన ఇంటికి
వెళ్ళగానే తనకు వెల్కమ్ చెప్పడానికి రెడీ గా ఉందని తెలిస్తే రేవంత్
ఎంత సంతోషిస్తాడో చూడాలి. కాగా అన్విత కి కూతురు పుట్టిందని
తెలిసిన అభిమానులు వారికీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు
తెలుపుతున్నారు.
