
రాజకీయ నాయకులు అంటే ప్రజల్ని దోచుకుంటారు అన్న
అభిప్రాయం మంత్రి రోజా గారు పోగొడుతున్నారు. నిరంతరం
ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు తెలుసుకొని వారికి తగిన సహాయాన్ని
అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

మంత్రి రాజా గారు తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ప్రజలకు
ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నారు.
కాగా నగరి నియ్యోజకవర్గం బీరకుప్పం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం
మరియు రోశమ్మ గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధ పడుతున్నారు.
అయితే “రోజా చారిటబుల్ ట్రస్ట్” ద్వారా వీరికి 20 వేళా ఆర్థిక సహాయం అందించారు.

విజయపురం మండలం , ఆలపాక గ్రామానికి చెందిన
కే.రాజేంద్రన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. ఇతనికిరోజా ట్రస్ట్ సభ్యులు
అతని చికిత్స కి గాను 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

అదే విధంగా నిద్ర మండలం K.R పాలెం కి చెందిన
శేఖర్ గారి మామ గారు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందారు.
ఆయన మరణం తో నిస్సహాయులైన కుటుంబ సభ్యులకి 50వేలు
ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
